కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న వైసీపీ

  • కడప జడ్పీ ఛైర్మన్ గా రామగోవిందరెడ్డి
  • ఎన్నికలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ
  • ఒకే నామినేషన్ రావడంతో గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటన
కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. జిల్లాపరిషత్ ఛైర్మన్ గా వైసీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. ఛైర్మన్ పదవికి కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్ రావడంతో రామగోవిందరెడ్డి గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. 

జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన రామగోవిందరెడ్డి బ్రహ్మంగారిమఠం మండలం జడ్పీటీసీగా రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ అధినేత జగన్... రామగోవిందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

Ramagovinda Reddy
YSCP
Kadapa Zilla Parishad
ZPTC
Andhra Pradesh Local Elections
TDP
Kadapa District
Jagan Mohan Reddy
Unopposed Election
Brahmangari Matham

More Telugu News